20-12-10

16-12-10

అట్లాంటిక్ సూర్యోదయం - Atlantic sunrise - 4











అట్లాంటిక్ సూర్యోదయం - Atlantic sunrise - 3




అట్లాంటిక్ సూర్యోదయం - Atlantic sunrise - 2




అట్లాంటిక్ సూర్యోదయం - Atlantic sunrise - 1

బోస్టనులో ఎప్పుడన్నా ఒడ్దు(బీచ్)కి పొద్దున్నే ౬కి వెళ్ళి అట్లాంటిక్ మహాసముద్రంపై సూర్యోదయం చూడాలని కోరిక.
మూడేళ్ళున్నా కుదరలేదు. మొదటి కారణం శనివారం పొద్దున్నే లేవడానికి బద్దకం. రెండవది నాకు కారులేదు. మొదటి ట్రైను ఐదింటికి. వెళ్ళేసరికి ఆరవుతుంది. మనం చలికాలం వెళ్ళలేం, ఎండాకాలంలోనేమో ఐదింటికే తెల్లారుతుంది.

ఇలా కాదని మొన్న అక్టోబరులో ముగ్గురం స్నేహితులం వెళ్ళాం. ఆహా ఏం రోజండి - మబ్బుమబ్బు, మైనస్ డిగ్రీల చలి. క్లికు కొట్టాలంటే, గ్లవ్స్ ఇప్పాలిగా. మొత్తం గంట అయ్యేసరికి వేళ్ళు కొంకురుపోయాయి. కానీ తీసిన ఫోటోలు తర్వాత చూస్కొంటే అన్ని మర్చిపోయా. 

అసలు ఆ మహాసముద్రం ముందు నించోని - ఆ చలిలో వణుకుతూ - చెవుల్లో ఇళయరాజా-రహమాన్ స్వరనాట్యం చేస్తుంటే, నింగి-సముద్రం నీలమై, ఇసుకలో ప్రతిబింబిస్తుంటే -  కొంగలు, ఫ్లేమింగోలు, విమానాలు - ఆ చలిలో కుక్కలతో చెడ్డీలేసుకొని జాగింగ్ చేస్తున్న అమ్మాయిలు - ఒక అరగంట ఎక్కడికో వెళ్ళోచ్చా.

ఆ తర్వత స్టార్‌‌బక్స్కి వెళ్ళి ఒక లార్జ్ కాఫీ తీస్కుంటే రెట్టింపయ్యింది మా మజా. నా బోస్టన్ జీవితంలో మరచిపోలేని రోజు.
ఒక ఇరవై చిత్రాలున్నాయి - నాలుగుచొప్పున పెడతా.





Nikon D60
Boston
Oct 2010



14-12-10

Diwali lights - దీపావళి వెలుగులు

 

Olympus C-370 in 2005

అసలు కాపీ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు, రీసైజ్ చేసిన ఆన్లైన్ కాపీ ఇది.

13-12-10

Boston Skyline - బోస్టన్ ఆకాశహర్మ్యాలు


Boston skyline. On the left, tallest building in New England area is the John Hancock building, on the right, tallest (incl. tower) is the Prudential Tower.

బోస్టన్ భవంతులు: ఎడమవైపున న్యూఇంగ్లండ్ ప్రాంతంలో ఎత్తైన జాన్ హన్‌‌కాక్ భవనము, కుడివైపు పైనున్న స్తంభంతోకలిపి అతి ఎత్తైన ప్రుడెన్షియల్ భవనము